బిగ్ బాస్ సీసన్ 3 : భారీగా తారక్ రెమ్యునరేషన్

SMTV Desk 2019-02-01 16:23:30  NTR, Big boss season 1, Big boss season 3, Host

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలుగు బిగ్ బాస్ సీసన్ 1 కి హోస్ట్ గా చేసిన జు.ఎన్టీఆర్ మళ్ళీ సీసన్ 3 కూడా హోస్ట్ గా ఎన్టీఆర్ నే చేయించాలని బిగ్ బాస్ యాజమాన్యం అనుకొంటోంది. సీసన్ 1కు తారక్ వల్లనే అంత రేటింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అదే ఫాలో అవుతున్న యాజమాన్యం తారక్ ని వొప్పించే క్రమంలో ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ అంశంపై రోజుకో వార్త వైరల్ గా మారుతోంది. స్టార్ మా గాని.. అలాగే తారక్ నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. RRR కోసం దర్శకదీరుడు రాజమౌళి బల్క్ డేట్స్ తీసుకోవడంతో తారక్ వేరే పనులేమీ పెట్టుకోవడం లేదని ముందు నుంచి అయితే వొక క్లారిటీ ఉంది.

అయితే సీసన్ 3 కి తారక్ కి ఇప్పుడు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారానికి రెండు సార్లు వచ్చేలా డేట్స్ ఇస్తే చాలని స్టార్ మా తారక్ ముందు డబుల్ రెమ్యునరేషన్ ని ఉంచినట్లు తెలుస్తోంది. మొదటి ఎపిసోడ్ కి 14 కోట్ల వరకు ఇచ్చినట్లు అప్పట్లో టాక్. ఇక ఇప్పుడు తారక్ RRR వంటి భారీ ప్రాజెక్టులో ఉండడంతో రేంజ్ పెరిగింది. అంతకంటే ఎక్కువగా అఫర్ చేయడంతో తారక్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దాదాపు తారక్ ని హోస్టింగ్ కి సైన్ చేయించే విధంగా బిగ్ బాస్ యూనిట్ సగం దూరం వచ్చినట్లు సమాచారం.