'దేవ్' పైనే రకుల్ ఆశలు...

SMTV Desk 2019-02-01 15:27:07  Rajul preet singh, Dev, Spyder, NTR Kathanayakudu

హైదరాబాద్, ఫిబ్రవరి 1: 2017లో మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమాలో నటించిన రకుల్ తరువాత తెలుగులో వొక్క సినిమా కూడా చేయలేదు. ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు లో శ్రీదేవి పాత్రలో నటించినా ఆమె పాత్ర గుర్తుపెట్టుకునే విధంగా అయితే లేదు. ప్రస్తుతం రకుల్ చేతిలో వొక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళ, హిందీ భాషల్లో మాత్రం కొన్ని సినిమాలు చేస్తోంది. అందులో కార్తి దేవ్ సినిమా కూడా ఉంది. గతంలో కార్తితో కలిసి ఖాకీ అనే సినిమాలో నటించింది రకుల్. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది.

ఇప్పుడు దేవ్ సినిమాపైనే రకుల్ ఆశలన్నీ పెట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో అమ్మడు రొమాన్స్ డోస్ కూడా బాగానే పెంచింది. ఈ సినిమా హిట్ అయితే తెలుగు, తమిళ భాషల్లో మరిన్ని అవకాశాలు సంపాదించుకోవచ్చనేది రకుల్ ఆలోచన. అందుకే ఈ సినిమాపైనే తన దృష్టి మొత్తం పెట్టింది. సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్తమ్మాయిల హవా పెరగడంతో రకుల్ జోరు బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. రజత్ రవిశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.