కేవలం రూ.500లతో రైతులకు సర్దుబాటు: శశి థరూర్‌

SMTV Desk 2019-02-01 15:12:20  Shashi Tharoor, Union Budget Meeting

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభామయ్యాయి. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు శాశితరుర్ మాట్లాడుతూ, బడ్జెట్ సమావేశం వొక వ్యంగ్య రచనలా మారిందన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలో ప్రజలని ఆకర్షించే విధంగా బడ్జెట్ తీరును మార్చారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు కలిపించిన పన్ను మినహాయింపు మాత్రమే తమకు సంతృప్తినిచ్చిందన్నారు.

అలాగే బడ్జెట్లో ప్రకటించిన 'కిసాన్ సమ్మాన్ నీది' రైతులకు సంవత్సరానికి 6 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. అంటే రైతుకు నెలకు కేవలం 500 రూపాయలు ఇవ్వనున్నారు. ఇంత తక్కువ మొత్తంతో రైతులు ఎలా గౌరవంగా, డిగ్నిటీగా జీవిస్తారని అడిగారు. నెలకు రూ. 500లు ఇస్తే రైతు ఆదాయం రెట్టింపవుతుందా అంటూ శశి థరూర్‌ ప్రశ్నించారు.