'ఎన్టీఆర్ మహానాయుకుడు' తరువాతే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.....!

SMTV Desk 2019-02-01 13:31:12  Ram gopal varma, Twitter, Lakhmis NTR, NTR Mahanayakudu

హైదరాబాద్, ఫిబ్రవరి 1: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన స్టైల్ లో సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటూ యువతని తనవైపు మల్లించుకుంటాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై రోజుకో ట్వీట్ పెడుతూ భిన్నంగా ప్రచారం చేస్తున్నాడు వర్మ. తాజాగా ఆ సినిమాపై మరో ట్వీట్ పెట్టాడు ఆర్జీవీ. మొదటి నుండి తన సినిమాను క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా నిలబెడుతున్నాడు వర్మ. ముందుగా క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 25న విడుదల చేస్తానని చెబితే.. వెంటనే వర్మ జనవరి 26న లక్ష్మీస్ ఎన్టీఆర్ వస్తుందని ప్రకటించాడు.

ఆ తరువాత ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7కి వాయిదా పడితే.. తన సినిమాను కూడా ఫిబ్రవరి 8కి వాయిదా వేశాడు. తాజాగా ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న విడుదలవుతుందని అంటున్నారు. ఆ తరువాతి రోజే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని విడుదల చేయాలని చూస్తున్నాడు వర్మ. ఈ మేరకు తన సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెట్టాడు. ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో.. అప్పుడే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటిస్తానని, స్వర్గం నుండి ఎన్టీఆర్ గారు ఇలా చేయమని చెప్పినట్లు వర్మ చెబుతున్నాడు. మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన 24 నిమిషాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేస్తానని ట్వీట్ చేశాడు.