నెటిజన్‌కు జ్వాల వార్నింగ్‌...!

SMTV Desk 2017-08-01 12:43:51  Celebrity, social media, Notions are comments, Badminton star gutta flame, mother

న్యూఢిల్లీ, ఆగస్టు 1 : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై కొందరు నెటిజన్ లు కామెంట్స్ చేయడం సాధారణమైపోయింది. ఇటీవల బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల తల్లిని లక్ష్యం గా చేసుకొని పదే పదే విమర్శిస్తున్న ఓ నెటిజన్ వ్యాఖ్యలను జ్వాల కూడా అదే స్థాయిలో తిప్పికొట్టింది. అసలు విషయంలోకి వెళితే... జ్వాల తల్లి యెలాన్‌ చైనా దేశస్థురాలు. దీంతో ‘నీ తల్లి చైనీయురాలు కాబట్టి నువ్వు ప్రతిసారీ ప్రధాని మోదీని వ్యతిరేకిస్తావు’ అని ఓ నెటిజన్‌ జ్వాలను విమర్శించాడు. సరిహద్దులో చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో ఆ యూజర్‌ దానిని సాకుగా తీసుకొని జ్వాలను విమర్శించడం ప్రారంభించడంతో, దానికి జ్వాల గట్టిగానే స్పందిస్తూ ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆ నెటిజన్ కు వార్నింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు ఏ నెటిజనైన నా తల్లిదండ్రుల గురించి చేదుగా ప్రస్తావిస్తే ఊరుకోబోనని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలంటూ హెచ్చరించింది.