గాంధీకి ప్రముఖుల నివాళులు

SMTV Desk 2019-01-30 12:41:41  Mahatma Gandhi, Ramnath Kovind, Venkaiah Naidu, Narendra Modi, Nirmala Seetharaman, Rahul Gandhi

న్యూ ఢిల్లీ, జనవరి ౩౦: భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మహోన్నతమైన వ్యక్తీ మహాత్మా గాంధీ. సత్యం, అహింస ఆయన ఆయుధాలు. ఈరోజు జాతీయ పిత మహుడు మహాత్మా గాంధీ 71వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి గల ఢిల్లీ లోని రాజ్ ఘాట్ వద్ద ఆయనకు పలువురు ప్రముఖులు, నేతలు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు మహాత్మునికి అంజలి ఘటించారు.