ట్రెండింగ్ లో 'నువ్వు వస్తావని'

SMTV Desk 2019-01-29 13:31:31  Vijay, Simran, Thulladha Manamum Thullum, Akkineni Nagarjuna, 20Years of

చెన్నై, జనవరి 29: తలపతి విజయ్, సిమ్రాన్ జంటగా నటించిన తమిళ చిత్రం తుల్లద మనమం తుల్లుం . ఈ సినిమాను తెలుగులో అక్కినేని నాగార్జున, సిమ్రాన్ కలిసి నటించిన నువ్వు వస్తావని సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా తమిళంలో 29 జనవరి 1999 న ప్రేక్షకుల ముందుకొచ్చి ఊహించని విధంగా హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాక తెలుగులో 5 ఏప్రిల్ 2000 సవత్సరంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.తమిళంలో ఈ సినిమాకు ఎజిల్ దర్శకత్వం వహించగా, ఆర్ బి చౌదరి నిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఏ రాజ్ కుమార్ అందించారు. అయితే ఈ సినిమా తమిళంలో వచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ తమిళ, తెలుగులో ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఈ సినిమా 2 దశాబ్దాలు పూర్తీ చేసుకున్న కారణంగా ట్విట్టర్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో ఉంది.