కొత్త డైరెక్టర్ ని నమ్మి బోల్తా పడ్డ యంగ్ హీరో

SMTV Desk 2019-01-28 17:02:24  Akhil, Nidhi Agarwal, Mr. Majnu, Venky Atluri, tholiprema, Varun Tej, Sankalp reddy

హైదరాబాద్, జనవరి 28: ఈ మధ్య కాలంలో ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ మొదటి సినిమాలతో అందర్నీ మెప్పించి రెండవ సినిమా తో బోల్తా కొడుతున్నారు. వీళ్ళని నమ్మి యంగ్ హీరోలు పరాజయాలను మూటగట్టుకుంటుంన్నారు. ఘాజి సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి రెండవ సినిమా అంతరిక్షం తో వరుణ్ తేజ్ కి డిసాస్టర్ను రుచి చూపించాడు. తర్వాత వచ్చిన F2 వరుణ్ ని ఆదుకుంది.

ఇదే విధంగా దర్శకుడు వెంకీ అట్లూరి తన మొదటి చిత్రం తొలి ప్రేమ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అతన్ని నమ్మి అఖిల్ మిస్టర్ మజ్ను సినిమా చేసాడు. అఖిల్ , హలో లాంటి వరుస పరాజయాల తర్వాత మిస్టర్ మజ్ను తో అయినా మొదటి హిట్ కొడదాం అనుకున్న అఖిల్ ను ఈ సినిమా ఘోరంగా నిరాశపరిచింది. ముఖ్యంగా ఈ చిత్రం లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో అఖిల్ మళ్ళి రీలాంచింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు.