రికార్డు బ్రేక్ చేసిన వెంకీ, వరుణ్..

SMTV Desk 2019-01-25 11:59:03  Venkatesh, Varun tej, F2 Movie, collections, dil raju

హైదరాబాద్, జనవరి 25: విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 సినిమా .. సంక్రాతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లోను మంచి విజయాన్ని అందుకుని రికార్డులను కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ సినిమా థియేటర్లకు వచ్చిన 13 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్లకి పైగా షేర్ ను .. ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ సంవత్సరం ఆరంభంలోనే తెలుగులో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన తొలి సినిమాగా తన ప్రత్యేకతను చాటుకుంది. కాగా ఈ సినిమాతో వెంకీ, వరుణ్ లు ఇద్దరు రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు. ఈ సీక్వెల్లో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతోపాటు రవితేజ కూడా నటించనున్నాడని సమాచారం.