'మిస్టర్ మజ్ను' ట్విట్టర్ రివ్యూ..

SMTV Desk 2019-01-25 11:13:14  Akhil, Mr.Majnu, nidi agarwal, venky atluri, BVSN Prasad, twitter review

హైదరాబాద్, జనవరి 25: అఖిల్ అక్కినేని హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్టర్ మజ్ను ఈ రోజు విడుదల కాబోతుంది. బివీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో నిది అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ఇక చిత్రానికి ప్రీమియర్ షోల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఓ క్యూట్ రొమాంటిక్ ప్రేమకథను తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు. తన గత చిత్రం తొలిప్రేమ తరహాలో మరో మంచి విజయం అందుకున్నాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో ఆడియన్స్ ను కదలనీయకుండా చేశాడు.

అఖిల్ తన నటనలో కొత్తదనం కనబరిచాడు. దర్శకుడు వెంకీ, అఖిల్ ను ఈ సినిమాలో మరింత హ్యాండ్సమ్ గా చూపించాడు. రొమాంటిక్ లుక్ తో, కొత్త బాడీ లాంగ్వేజ్ తో అఖిల్ తన నటనలోనూ.. డాన్స్ లోనూ కొత్తదనాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. నిధి అగర్వాల్ గ్లామర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ఇక అఖిల్ కి ఈ సినిమా తో తొలి హిట్ వచ్చే అవకాశాలు వున్నాయి.