గీతాంజ‌లి, త్రిపుర‌ మూవీ డైరెక్టర్ కి గుండెపోటు

SMTV Desk 2019-06-13 16:19:52  director raj kiran,

టాలీవుడ్‌లో గీతాంజ‌లి, త్రిపుర‌ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన దర్శకుడు రాజ్ కిర‌ణ్‌ కి స్వల్ప గుండె పోటు వచ్చినట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఆయన నందితా హీరోయిన్ గా నటించిన విశ్వామిత్ర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రేపు రిలీజ్ కూడా అవనుంది. అయితే ఆయనకీ స్వ‌ల్పంగా హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో ఆయ‌న్ని వెంట‌నే కూక‌ట్ ప‌ల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారని అయితే వైద్యులు సకాలంలో స్పందించి మెరుగైన వైద్యం అందించడంతో ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని సమాచారం.

నిజానికి రేపు రిలీజ్ కానున్న సినిమా రిలీజ్ కి సిద్దమయిందనే విషయమే చాలా మందికి తెలీక పోవడం, రేపు సినిమాల విషయంలో గట్టి పోటీ ఉండడంతో పాటు ఆయన గత సినిమాలలో లాగా ఈ సినిమా మీద సరయిన అంచనాలు లేకుండా పోవడం తో ఆయన చాలా టెన్షన్ తీసుకున్నట్టు చెబుతున్నారు. అంతే కాక సినిమాల విషయంలో పోటీ వలన థియేటర్ లు కూడా దొరకకపోవడంతో ఆయన స్వల్ప గుండెపోటు కి గురయ్యాడని అంటున్నారు. మ‌రో రెండు రోజుల‌లో ఆయ‌న‌ని డిశ్చార్జ్ చేయ‌నున్నార‌ని చెబుతున్నారు. చూడాలి మరి సినిమా రిజల్ట్ ఎలా ఉండనుందో ?