శృతిమించిన శృంగార సన్నివేశాలలో ఆడిపాడనున్న కియారా అద్వానీ

SMTV Desk 2019-05-29 12:05:06  Kaira Advani,hot,

టాలీవుడ్‌లో అరంగేట్రంతోనే టాప్ స్టార్స్ అయిన మహేష్, రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది కియారా అద్వానీ. ‘భరత్ అనే నేను’లో హోమ్‌లీ లుక్ లో కనిపించిన ఈ బ్యూటీ ‘వినయ విధేయ రామ’లో కొంచెం గ్లామర్ డోస్ పెంచింది. అయితే కియారాపై వస్తున్న ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ భామ అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఓ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అడల్ట్ కంటెంట్ అంటే శృతిమించిన శృంగార సన్నివేశాలతో సీన్స్ ఉంటాయి. ‘ఇందూ కి జవానీ’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో కియారా డేటింగ్ యాప్స్‌లో అబ్బాయిలను పరిచయం చేసుకొని వారితో డేటింగ్ చేసే అమ్మాయి పాత్రలో నటిస్తుందట. అయితే ఈ భామ ఇంతకు ముందే ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న పాత్ర చేసింది.