పేట ట్విట్టర్ రివ్యూ..

SMTV Desk 2019-01-10 11:07:49  Rajinikanth, Petta, Review

హైదరాబాద్, జనవరి 10: ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి వచ్చిన కబాలీ , కాలా , 2.0 ... ఇవన్నీ పాత రజనీని అభిమానులకు గుర్తు చేయలేకపోయాయనడంలో సందేహం లేదు. కానీ, ఈరోజు ఉదయం విడుదలైన పేట మాత్రం 90వ దశకంలోని రజనీని గుర్తు చేసిందట. ఈ ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమవగా, సినిమా చూసిన వారు మూవీ అద్భుతంగా ఉందంటున్నారు.


అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపరని అంటున్నారు. ఈ చిత్రం రజనీకాంత్ స్టయిల్ లో నడిచిన పక్కా మాస్ సినిమా అని, రజనీ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్స్ అయినా నరసింహ, బాషాను మించిపోయిందని అంటున్నారు. రజనీ కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు... అభిమానులకు కావాల్సినవన్నీ ఉన్నాయని, ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్ అని మరికొందరు ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. చాలా కాలం తరువాత పాత తలైవా తిరిగి కనిపించాడని అంటున్నారు.