'ఎఫ్2' ట్విట్టర్ రివ్యూ..

SMTV Desk 2019-01-12 11:41:00  Venkatesh, Varun tej, Tamannah, Mehreen, F2, Movie review

హైదరాబాద్, జనవరి 12: వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్2 సినిమా ఈరోజు విడుదల అయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ కధానాయకలుగా నటించారు. ఇక సినిమా విషయానికి వస్తే కధలో స్పష్టత లేకపోయినా వెంకీ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. వెంకటేష్ తో పోటీపడి వరుణ్ తేజ్ కామెడీ పండించటంలో విఫలమయ్యాడు.


మొదటి భాగంలో వెంకీ తన కామెడీతో బాగా అలరించాడు. కానీ రెండవ భాగంలో కామెడీ ఉన్నా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమా యావరేజ్ టాక్ తో నడుస్తుంది. మొత్తానికి ఈ సంక్రాంతికి వచ్చిన తెలుగు సినిమాలలో వెంకీ కొంత మేర ఆకట్టుకున్నాడనే చెప్పొచ్చు.