యాత్ర ట్విట్టర్ రివ్యూ...!

SMTV Desk 2019-02-08 08:08:43  Yatra movie, Yatra movie Review, Premier Show, Mammootty

హైదరాబాద్, ఫిబ్రవరి 08: దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాకశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర . ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రాజకీయనాయకుడు బయోపిక్ విడుదల కావడం హాట్ టాపిక్ గా మారింది. ఓవర్సీస్ లో ఈ సినిమా 180 స్క్రీన్ లలో విడుదల చేయగా.. రెండు తెలుగు రాష్ట్రాలలో 500 స్క్రీన్ లలో విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 970 స్క్రీన్ లలో విడుదలైంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమా ప్రదర్శితం కావడంతో అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

వైఎస్ గా మమ్ముట్టి ఎంట్రీ సీన్ హైలైట్ అని అంటున్నారు. వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటన వంక పెట్టలేని విధంగా ఉందని, డైరెక్టర్ నేరుగా కథలోకి వెళ్లి ఎమోషనల్ గా స్టోరీ నడిపారని అంటున్నారు. సినిమాలో చంద్రబాబు నాయుడిపై సెటైర్లు పడ్డాయని చెబుతున్నారు. ఓటుకి నోటు కేసులో ఆడియో టేపుని కూడా వాడినట్లు తెలుస్తోంది. మమ్ముట్టి పలికే కొన్ని డైలాగులు మర్చిపోలేని విధంగా ఉన్నాయట. వైఎస్ జగన్ కి సంబంధించిన ప్రజా సంకల్పయాత్ర ఒరిజనల్ వీడియోలను ఈ సినిమాలో చూపించారని చెబుతున్నారు.