'పేట' ..వన్ మాన్ షో

SMTV Desk 2019-01-10 15:52:29  Rajinikanth, Petta, Review, Peta review, Simaran, Super Star Rajinikanth, vijay sethupathi

హైదరాబాద్, జనవరి 10: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా 2.ఓ తరువాత తెరకెక్కిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ పేట. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఎన్నో వివాదాల మధ్య రిలీజ్‌ అయ్యింది. ఈ సంక్రాంతికి తెలుగులో భారీ చిత్రాలు బరిలో ఉండటంతో పేటకు రజనీ స్థాయిలో థియేటర్లు దక్కలేదు. అయితే రజనీ మేనియా కారణంగా అంచనాలైతే భారీగానే ఉన్నాయి. మరి ఇన్ని కష్టాల మధ్య పేట తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది.? రజనీ మ్యాజిక్‌ రిపీట్ అయ్యిందా..?

టైటిల్ : పేట
నటీనటులు : రజనీకాంత్‌, త్రిష, సిమ్రన్‌, విజయ్‌ సేతుపతి, నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ
సంగీతం : అనిరుధ్ రవిచందర్
దర్శకత్వం : కార్తీక్‌ సుబ్బరాజ్‌
నిర్మాత : అశోక్‌ వల్లభనేని, కళానిథి మారన్‌



కథ‌ :
కాళీ (రజనీకాంత్‌) ఓ హాస్టల్ లో పనిచేస్తుంటాడు. అక్కడ పనిచేసే డాక్టర్‌(సిమ్రన్‌)తో కాళీకి పరిచయం ఏర్పడుతుంది. అంతా సరదాగా సాగిపోతున్న సమయంలో కాళీకి లోకల్‌ రౌడీతో గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా కాళీ గతం గురించి తెలుస్తోంది. అసలు కాళీ గతం ఏంటి? కాళీగా ఎందుకు మారాడు..? సింహాచలం(నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ)కు, రజనీకు మధ్య గొడవ ఏంటి.? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు :
రజనీకాంత్ కాళీగా తనదైన స్టైలిష్‌, మాస్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. అభిమానులను అలరించే స్టైల్స్‌కు మాత్రం కొదవేలేదు. ఇద్దరు హీరోయిన్స్‌ సిమ్రాన్, త్రిషలకి కధలో పెద్దగా ప్రాదాన్యత లేకపోయినా, వారి అందచందాలు సినిమాకి ప్లస్ అయ్యాయి. విజయ్‌ సేతుపతి, నవాజుద్ధిన్‌ సిద్ధిఖీల పాత్రలు గుర్తుండిపోయేలా లేవు. అయితే సినిమా అంతా రజనీ వన్‌మేన్‌ షోలా సాగటంతో ఇతర పాత్రలు గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. శశికుమార్‌, బాబీ సింహా, మేఘా ఆకాష్‌, నాగ్‌ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. రజనీ స్టైలిష్‌, మాస్‌ యాక్షన్‌ తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్స్ అయినా నరసింహ, బాషాను మించిపోయిందని, 90వ దశకంలోని రజనీని గుర్తు చేసిందటున్నారు.


ప్లస్‌ పాయింట్స్‌ :
➤ రజనీకాంత్‌
➤ నేపథ్య సంగీతం
➤ కధ మధ్యలోని ట్విస్ట్‌లు

మైనస్‌ పాయింట్స్‌ :
➤ రొటీన్‌ కథ
➤ తమిళ నేటివిటి