'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ..

SMTV Desk 2019-01-11 11:55:51  Ram Charan, Vinaya Vidheya Rama, Boyapati Srinu, kiara advani, movie review

హైదరాబాద్, జనవరి 11: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో అభిమానులని, ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.


ఇక చిత్ర విషయంలోకి వస్తే బోయపాటి డైరెక్షన్ ఆశించినంత ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ సీన్స్ అన్ని తన పాత సినిమాలని పోలి ఉండటం, రొటీన్ స్టోరీ కావడంతో ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నారు. ఇంకా చరణ్ డాన్స్ పరంగా ఆకట్టుకున్న నటన పరంగా మంచి మార్కులు సంపాదించలేకపోయాడు. కైరా అందచందాలుకూడా అంతగా ఆకట్టుకునేలా లేకపోవడంతో సినిమా యావరేజ్ టాక్ లో నడుస్తుంది.