'ఎఫ్3' లో మరో టాప్ హీరో..

SMTV Desk 2019-01-23 13:33:40  Venkatesh, Varun tej, F2, F3 Movie, Raviteja, anil ravipudi

హైదరాబాద్, జనవరి 23: వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 చిత్రం సంక్రాంతి పండుగకి బరిలోకి దిగి తన సందడిని కొనసాగిస్తూనే వుంది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమా పాత రికార్డులను తిరగరాస్తూ వెళుతోంది. వెంకీ .. వరుణ్ ల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు అనిల్ చెప్పాడు. వొక సందర్బంలో వరుణ్ తేజ్ కూడా ఎఫ్ 3 ఉంటుందని అన్నాడు.

ఈ నేపథ్యంలో ఎఫ్3 కి సంబందించిన వార్త వొకటి ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతోనే ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 రానుంది. అయితే వీరికి తోడు రవితేజ కూడా ఈ సినిమాలో నటించనున్నాడని అంటున్నారు. రవితేజ. అనిల్ కాంబినేషన్లో వచ్చిన రాజా ది గ్రేట్ చిత్ర తరహాలోనే ఈ సినిమాలో కూడా రవితేజ అంధుడిగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ పాత్ర నుంచి కూడా నాన్ స్టాప్ నవ్వులు పూయించడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడని సమాచారం.