షమీ న్యూ రికార్డ్...

SMTV Desk 2019-01-23 12:24:06  Shami, 100 ODI wickets, Indian cricket team

న్యూ ఢిల్లీ, జనవరి 23: భారత క్రికెట్ జట్టు ఆటగాడు ఫాస్ట్ బౌలర్ షమీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు నేపియర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో షమీ కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ను అవుట్ చేసి భారత్ తరుపున వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. కెరీర్‌లో 56వ వన్డే ఆడుతున్న షమీ 5.51 ఎకానమీతో ఈ వంద వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 2004లో ఇర్ఫాన్ పఠాన్ నెలకొల్పిన రికార్డ్ బద్దలైంది.

పాకిస్థాన్‌తో 15ఏళ్ల క్రితం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ తన 59వ వన్డేలో 100 వికెట్ల మైలురాయిని అందుకోగా.. షమీ 56వ వన్డేతోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో షమీ, పఠాన్ తర్వాత.. జహీర్ ఖాన్ 65 వన్డేల్లో, అజిత్ అగార్కర్ 67 వన్డేల్లో, జవగళ్ శ్రీనాథ్ 68 వన్డేల్లో ఈ వంద వికెట్ల మైలురాయిని అందుకున్నారు.