భారీగా 'ఆర్.ఆర్.ఆర్' శాటిలైట్ రైట్స్..

SMTV Desk 2019-01-22 16:48:32  SS Rajamouli, NTR, Ram Charan, RRR Movie, DVV Dnayya, satilight rites

హైదరాబాద్, జనవరి 22: దర్శకదీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. నిన్ననే ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటంతో, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ఛానల్స్ మధ్య గట్టిపోటీ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో జీ టెలివిజన్ నెట్ వర్క్ వారు తెలుగు, తమిళ, హిందీ శాటిలైట్ రైట్స్ కోసం 150 కోట్లు ఆఫర్ చేసినట్టుగా సమాచారం. ఈ ఆఫర్ ను నిర్మాత దానయ్య హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. బాహుబలి .. బాహుబలి 2 తరువాత, భాషతో సంబంధం లేకుండా రాజమౌళి సినిమాలపై క్రేజ్ పెరిగిపోయింది. ఈ కారణంగానే ఈ సినిమా శాటిలైట్ హక్కులకు ఈ స్థాయి రేటు పలుకుతోందని అంటున్నారు.