'మిఠాయి' విడుదలకి ముహూర్తం ఖరారు ..!!

SMTV Desk 2019-01-22 16:06:54  Mithai movie, new movie, Priyadarshi, Rahul Ramakrishna, Prashanth, Prabhath

హైదరాబాద్, జనవరి 22: ​సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సాయి భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు ఎక్కువ కంటున్నాడని కంపెనీ అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే... ఓ సమస్య ఎదురవుతుంది. మూడు రోజుల్లో ఓ దొంగ‌ను ప‌ట్టుకుంటేనే పెళ్లి జ‌రుగుతుంది.

ప‌ట్టుకోలేదంటే పెళ్లి జ‌ర‌గ‌దు. అటువంటి సంద‌ర్భంలో త‌న స్నేహితుడు జానీతో క‌లిసి దొంగ‌ను పట్టుకోవ‌డానికి సాయి బ‌య‌లుదేర‌తాడు. ఈ ప్ర‌యాణంలో అత‌డికి ఎదురైన స‌మ‌స్య‌లేంటి? సాయి దొంగ‌ను ప‌ట్టుకున్నాడా? లేదా? అస‌లు, ఆ దొంగ ఎవ‌రు? సాయి పెళ్లి జ‌రిగిందా? లేదా? ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల‌వుతున్న మా చిత్రం చూసి తెలుసుకోమంటున్నారు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ కుమార్‌.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన డార్క్ కామెడీ చిత్రం మిఠాయి . డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22 న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం టీజర్ విడుదల చేశారు.