అఖిల్ అస్సలు తగ్గట్లేదుగా : 'Mr.మజ్ను' ట్రైలర్

SMTV Desk 2019-01-20 12:20:01  Mr Mjanu Trailer, Mr Majnu, Akhil akkineni, NIdhi agrawal, Venky atluri, NTR

హైదరాబాద్, జనవరి 20: అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం Mr.మజ్ను . ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే ఈ నెల 25 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి జరిగింది. అందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ఈవెంట్ కు యాంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అథిదిగా హాజరయ్యారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే అఖిల్ మరోసారి తన నటనతో అందరిని ఆకట్టుకునేల కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ తమన్ మ్యూజిక్ కూడా హైలేట్ గా ఉంది. ట్రైలర్ లోనే అంత మంచి మ్యూజిక్ ను టేస్ట్ చేపించిన తమన్ ఇక సినిమాలో ఏ మాత్రం తీసిపోకుండా మ్యూజిక్ కంపోస్ చేసినట్టు ఉన్నాడు. ఇంకా ఈసినిమాలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.