తెలుగులో 'విశ్వాసం' విడుదలకి రంగం సిద్ధం..

SMTV Desk 2019-01-19 13:47:44  Ajith, new movie, Viswasam, telugu, release date

హైదరాబాద్, జనవరి 19: తలా అజిత్ కుమార్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన విశ్వాసం పొంగల్ కానుకగా ఈ నెల 10వ తేదీన తమిళనాడులో భారీస్థాయిలో విడుదలైంది. పొంగల్ సీజన్లో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ పేట చిత్రంతో పోటీపడుతూ ఈ సినిమా దూసుకుపోతోంది. అజిత్ సినిమా హిట్ కావడంతో ఆయన అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. తమిళంలో విడుదలైన రోజునే తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తెలుగులో పోటీ ఎక్కువగా ఉండటంతో థియేటర్ల సమస్య తలెత్తుతుందని ఆగారు.

అయితే ఇప్పుడు పోటీ తగ్గడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 1వ తేదీన తెలుగులో విడుదల చేయాలని భావిస్తున్నారు. అజిత్ హీరోయిజం, నయనతార అందచందాలు .. జగపతిబాబు విలనిజం తెరపై చూసి తీరవలసిందేనని అంటున్నారు. తెలుగులో ఈ సినిమా ఏ స్థాయిలో సందడి చేస్తుందో వేచి చూడాలి మరి.