మహర్షి టీజర్ డేట్ ఫిక్స్ ? ? ..

SMTV Desk 2019-01-19 12:14:15  Mahesh babu, Maharshi, New movie, teaser release date

హైదరాబాద్, జనవరి 19: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా తెరకెక్కుతుంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా అవ్వటంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటున్నాడు. దాదాపుగా సగంపైనా షూటింగ్ ఇప్పటికే పూర్తిఅయింది. ఈ చిత్రంలోని పోస్టర్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముందు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఇక త్వరలోనే టీజర్లు .. ట్రైలర్లు సందడి చేస్తాయని అభిమానులు, ప్రేక్షకులు భావించారు. కానీ ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొంచెం ఆలస్యంగానే టీజర్ వస్తోంది. మార్చి 4వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందని అంటున్నారు. ఆ రోజునే టీజర్ ద్వారా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ మహేష్ చిన్ననాటి స్నేహితుడి పాత్రలో కనిపించనున్నారు.