'వినయ విధేయ రామ' తొలివారం కలెక్షన్స్..

SMTV Desk 2019-01-18 17:40:56  Ram Charan, Vinaya Vidheya Rama, Boyapati Srinu, kiara advani, first week collections

హైదరాబాద్, జనవరి 18: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పండుగ సెలవులు కావడంతో ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. దర్శకుడిగా బోయపాటికి గల ఇమేజ్ .. చరణ్ కి గల క్రేజ్ కారణంగా, తొలివారంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 50 కోట్ల షేర్ ను సాధించింది. వొక్క నైజాంలోనే ఈ సినిమా తొలివారంలో 12 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ వీకెండ్ లో అంతగా చెప్పుకోదగిన సినిమాలు ఏమీ లేకపోవడం వలన, ఈ చిత్ర వసూళ్లు పడిపోయే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతూనే వచ్చారు. దాంతో ఓ మాదిరి యాక్షన్ తో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని అంతా ఆశించారు. కానీ యాక్షన్ పాళ్లు ఎక్కువైపోవడం ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది.