గోపీచంద్ చిత్రానికి రంగం సిద్ధం..

SMTV Desk 2019-01-18 17:28:22  Gopi chand, new movie

హైదరాబాద్, జనవరి 18: హీరో గోపీచంద్ కెరియర్ ప్రారంభంలో యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేసారు. ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవ్వటానికి యాక్షన్ కి ఎమోషన్ ను జోడించి సినిమాలు చేస్తున్నారు. తన సినిమాలో మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. అయినా కొంతకాలంగా ఆయనను సక్సెస్ అనేది పలకరించలేదు. దాంతో గోపీచంద్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథలోనూ .. పాత్రలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో ఆయన దర్శకుడు తిరు తో కలిసి వొక సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ఇద్దరు కథానాయికలను ఎంపిక చేయనున్నారు. ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమా తొలి షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరగనుంది. కొన్ని యాక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తారట.