తాత పాత్రలో నాగ్..

SMTV Desk 2019-01-18 13:44:42  Nagarjuna, naga chaitanya, soggade chinni nayana, new movie, bangarraju

హైదరాబాద్, జనవరి 18: అక్కినేని నాగార్జున హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకి మంచి పేరు వచ్చింది. దాంతో ఆ పాత్రను హైలైట్ చేస్తూ .. బంగార్రాజు పేరుతోనే వొక సినిమా చేయాలని దర్శకుడు కల్యాణ్ కృష్ణకి నాగార్జున చెప్పారు. అప్పటి నుంచి కూడా కథలో మార్పులు .. చేర్పులు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా నాగార్జునకి దర్శకుడు కల్యాణ్ చెప్పిన కధ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

అయితే అన్నపూర్ణ బ్యానర్లోనే ఈ సినిమాను పట్టాలెక్కించడానికి నాగ్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా నటించనున్నాడట. తాత పాత్రలో నాగార్జున .. మనవడి పాత్రలో చైతూ కనిపించనున్నారని సమాచారం. ఈ రెండు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుందని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.