రొమాన్స్ హైలైట్ గా మజిలీ..

SMTV Desk 2019-01-17 11:22:01  Nagachaitanya, Samantha, majili, new movie

హైదరాబాద్, జనవరి 17: అక్కినేని నాగ చైతన్య .. సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ అనే సినిమా రూపొందుతుంది. సరికొత్త కధనంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. 1990 నాటి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్ర కథ కొనసాగుతుంది. చైతన్య .. సమంత కాంబినేషన్లో వచ్చే రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ రొమాంటిక్ సీన్స్ ను రియల్ గా చిత్రీకరించారని సమాచారం.

ఈ చిత్రంలో సమంతతో పెళ్లికి ముందు వొక గెటప్ లో .. పెళ్లి తరువాత మరో గెటప్ లో చైతూ కనిపిస్తాడని అంటున్నారు. దివ్యాంశ కౌశిక్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. పెళ్లైన తరువాత మొదటిసారి చైతూ .. సమంత కలిసి చేస్తోన్న సినిమా కావడం, అందునా ప్రేమికులుగా .. ఆ తరువాత భార్యాభర్తలుగా కనిపించనుండటం వలన ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.