కార్తికేయ కొత్త చిత్రం మొదలు..

SMTV Desk 2019-01-17 10:56:44  Karthikeya, Rx100, New movie, ongole

హైదరాబాద్, జనవరి 17: ఆర్ ఎక్స్ 100 తో భారీ విజయాన్ని అందుకున్న కార్తికేయ, ఆ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో ఈ హీరోతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రాన్ని అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేయడానికి అంగీకరించాడు. గతంలో బోయపాటి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల, ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను వొంగోలులో ప్లాన్ చేశాడు.

కాగా ఈరోజు నుంచి వొంగోలులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా నిర్మాతలు అనిల్ కడియాల .. తిరుమల రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు, రెండు పాటలను కూడా ఇక్కడ చిత్రీకరించనున్నాము. హీరోయిన్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది .. త్వరలో మిగతా వివరాలు తెలియజేస్తాము అని అన్నారు.