'సైరా' నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్..

SMTV Desk 2019-01-16 13:00:13  Chiranjevi, saira narasimha reddy, vijay sethupathi, first look

హైదరాబాద్, జనవరి 16: చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమాలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు విజయ్ సేతుపతి బర్త్ డే కానుకగా చిత్రంలోని ఆయన లుక్ ను విడుదలచేసారు. రాజా పాండి అనే పాత్రలో విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వీరుడిలా కత్తి పట్టుకుని కనిపిస్తున్న విజయ్‌ సేతుపతి లుక్‌ ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, తమన్నా తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న సినిమాను విడుదల చేసేందుకు రామ్ చరణ్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.