దేశం ఏమైనా మీ జాగిరా...???

SMTV Desk 2019-01-13 16:25:31  Prakash raj, Amith shah, BJP, Prakash raj twitter account

బెంగుళూర్, జనవరి 13: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా 2019 లోక్‌సభ ఎన్నికలను పానిపట్టు యుద్ధంతో పోల్చడంపై ఘాటుగా స్పందించారు. ‘ఇదేమీ 1761 కాదు.. బీజేపీ నేతలు మరాఠాలు కాదు దేశ జనాభా ఆఫ్ఘాన్ సైన్యమూ కాదు అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘దేశం ఏమైనా మీ జాగీరా అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ ప్రతినిధుల సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ.. పానిపట్టు యుద్ధంలో మరాఠాల ఓటమితో దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయిందని.. ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనలో 200 ఏళ్లు బానిసత్వాన్ని అనుభవించామన్నారు.

2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని, లేకుంటే మళ్లీ బానిసత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపైనే ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రంగం చేసుకుంటున్న ప్రకాశ్ రాజ్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ.. తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.