థియేటర్‌కు వెళ్లి సినిమా చూశా: వెంకటేష్‌‌

SMTV Desk 2019-01-13 10:33:27  Venkatesh, f2, f2 success meet, varun tej

హైదరాబాద్ , జనవరి 13: ‘f2 మూవీ హీరో విక్టరీ వెంకటేష్‌‌, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. శనివారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. ఓ మంచి సినిమాను ఇవ్వాలి అనుకుని సంక్రాంతికి విడుదల చేశాం. ఎన్నో ఏళ్ల తర్వాత ఇవాళ థియేటర్‌కు వెళ్లి సినిమా చూశా. నిజంగా చాలా మంచి భావన కల్గింది. ప్రతి సన్నివేశాన్నీ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇకపై ఇంకా మంచి సినిమాలు నా నుంచి వస్తాయి. ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు.

‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఏడాదిన్నరకు ముందు ‘ఫిదా సక్సెస్‌ మీట్‌ కోసం ఇక్కడికి వచ్చా. మళ్లీ ఇప్పుడు ‘f2′ కోసం వచ్చాను. తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికా నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. పొద్దున థియేటర్‌లో సినిమా చూశాం. నేనే వెంకీ గారిని లాక్కుని వచ్చాను (నవ్వుతూ). సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది. దర్శక, నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు అని వరుణ్‌తేజ్‌ చెప్పారు.