త్రివిక్రమ్, బన్నీ సినిమాకి రంగం సిద్ధం..

SMTV Desk 2019-01-12 11:07:48  Allu arjun, New Movie, trivikram

హైదరాబాద్, జనవరి 12: గత ఏడాది అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా ఆశించినంత విజయం సాధించలేక పోయింది. దాంతో తరువాత చేసే చిత్ర కథాకథనాల విషయంలో బన్నీ చాలా శ్రద్ధపెడుతున్నాడు. తన సినిమా నుంచి ప్రేక్షకులకు, అభిమానులకు కావాల్సింది ఏమిటో ఆయనకు పూర్తిగా తెలుసు. అందువలన వాళ్లకి కావలసిన అంశాలు కథలో ఉండేట్టుగా చూసుకుంటూనే, కొత్తదనం మిస్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. దీంతో బన్నీ ఈ సారి త్రివిక్రమ్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన కథపైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. ఫిబ్రవరిలో పూర్తి స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ సిద్ధం చేస్తాడట, కాగా, వచ్చేనెలలో ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే ఇక మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని పేరు వినిపిస్తోంది. గతంలో త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో జులాయి .. సన్నాఫ్ సత్యమూర్తి రావడంతో, ఈ సారి హ్యాట్రిక్ హిట్ కొడతారని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు.