నెంబర్ 1 మేరీ కోమ్

SMTV Desk 2019-01-11 13:49:38  International Boxing Association, Mary kom, Sports, Olympics

జనవరి 11: మహిళా ప్రపంచ బాక్సింగ్‌ లో ఎన్నో పతకాలు సాధించిన భారత బాక్సర్ మేరీ కోమ్‌కు మరో అరుదైన ఘనత లభించింది. అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం(ఐబా) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మేరీ కోమ్ నెంబర్ వన్ గా నిలిచించి. గతేడాది నవంబర్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ఫిప్‌లో 48 కేజీల విభాగంలో మేరీ స్వర్ణం సాధించింది. దినితో తనకు వరుసగా ఆరో వరల్డ్ చాంపియన్‌షిప్ కావడం విశేషం. అందుకే తాజా ర్యాంకింగ్స్ లో 1700 వందల పాయింట్లతో మేరీ అగ్రస్థానంలో నిలిచింది. 2020 టోక్యోలో జరగబోయే వొలింపిక్స్‌లో మేరీ కోమ్ 51 కేజీల విభాగంలో పొటీ పడనుంది.