కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు భగ్నం

SMTV Desk 2017-07-28 17:05:34  Kashmir, Terrorists, Attack

జమ్ముకశ్మీర్, జూలై 28 : జమ్ముకాశ్మీర్ లోని పోషియాన్ జిల్లా గురేజ్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. తనిఖీలు నిర్వహించి వస్తున్న సిబ్బందిపై దాడికి దిగడంతో భారత సైన్యం ముగ్గురు ముష్కరులను మట్టు పెట్టింది. నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించిన భద్రత బలగాలు ఉగ్రవాదులను గుర్తించి వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.