ఓపెనింగ్స్ లో ‘విశ్వాసం’ టాప్‌..

SMTV Desk 2019-01-11 13:26:46  Ajith, new movie, Viswasam, first day collectins

చెన్నై, జనవరి 11: సూపర్ స్టార్ రజనీకాంత్‌ పేట , అజిత్‌ విశ్వాసం వొకే రోజు విడుదల అయ్యి బాక్సాఫీస్‌ వద్ద పోటీపడుతున్నాయి. దీంతో రజనీ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్‌ థియేటర్‌ వద్ద గొడవలు పడుతున్నారు. వీరి ఫ్యాన్స్‌ను కంట్రోల్‌ చేయలేక పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న ఇద్దరు బడా హీరోల సినిమాలు వొకే రోజు విడుదలైతే ఎలా ఉంటుందో తమిళనాడులో పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఈ రెండు చిత్రాలకు పాజిటివ్‌ టాక్‌ రాగా.. కలెక్షన్స్‌లో మాత్రం విశ్వాసం ముందంజలో ఉంది.తమిళంలో ఈ సినిమా టాప్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ మూవీ వసూళ్లలో ముందు వరుసలో ఉంది. సినీ విశ్లేషకుల సమాచారం ప్రకారం తొలిరోజు విశ్వాసం దాదాపు 26కోట్లను వసూళు చేసినట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన వేదలం, వివేగం, వీరం లాంటి హ్యాట్రిక్‌ హిట్స్‌ తరువాత అజిత్ నటించిన విశ్వాసం కూడా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. నయన తార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఇమ్మాన్‌ సంగీతాన్ని అందించారు.