'కేజీఎఫ్ 2'లో ఇద్దరు పెద్ద నటులు..

SMTV Desk 2019-01-11 11:29:49  Yash, KGF Movie, KGF2, Sanjay datt, Ramyakrishn

హైదరాబాద్, జనవరి 11: కన్నడ హీరో యాష్ నటించిన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలై భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లు రాబడుతూ వెళుతోంది. ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతూ ఉండగానే, దీని సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్ర నిర్మాత విజయ్ కిరంగన్ దుర్ అప్పుడే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశాడు.2వ భాగానికి సంబంధించి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ .. రమ్యకృష్ణల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. భారత రాష్ట్రపతి పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందనీ .. కొత్తగా క్రియేట్ చేసిన వొక పవర్ ఫుల్ పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తాడని అంటున్నారు.



కేజీఎఫ్2 పూర్తిగా దుబాయ్ మాఫియా నేపథ్యంలో సాగుతుందని సమాచారం. కాగా, కేజీఎఫ్ లో చేసిన రవిశంకర్ .. అదే పాత్రలో రెండవ భాగంలోను కొనసాగుతాడట. అయితే ఈసారి మరింత పవర్ఫుల్ గా ఆయన పాత్రను తీర్చిదిద్దుతున్నట్టుగా చెబుతున్నారు. దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.