ఈ నెల 14న 'దేవ్' ఆడియో రిలీజ్..

SMTV Desk 2019-01-10 18:46:33  Karthi, rakul perrth singh, new movie, Dev, audio release

హైదరాబాద్, జనవరి 10: తమిళ హీరో కార్తీ, రకుల్ ప్రీతీ సింగ్ జంటగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో దేవ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చగ, లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తోన్నారు. కాగా, భోగి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన ఈ సినిమా తెలుగు ఆడియోను రిలీజ్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ కాన్సెప్ట్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని కార్తీ భావిస్తున్నాడు. గతంలో కార్తీ .. రకుల్ జంటగా నటించిన ఖాకీ తమిళంతో పాటు తెలుగులోను మంచి విజయం సొంతం చేసుకుంది. అలాగే మంచి వసూళ్లు రాబట్టింది. ఇక దేవ్ కూడా అదే బాటలో దూసుకుపోతాడా లేదా అనేది వేచి చూడాలి.