అప్పట్లో రోజాను వదులుకున్నా ???

SMTV Desk 2019-01-09 19:33:21  Varun Tej,Venkatesh, F2 movie, Roja movie

హైదరాబాద్, జనవరి 9: విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్2 . ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమాను నిజానికి తాను చేయాల్సి ఉందని.. కానీ చేతికి గాయం కావడంతో చేయలేకపోయనన్నారు. అయితే దాని గురించి నేనెప్పుడూ బాధ పడలేదు. ఆ సినిమా చేయలేకపోయినా ‘సుందరకాండ వంటి కుటుంబ కథా చిత్రాలు ఎన్నో చేశాను. ఏం జరిగినా మన మంచికే అనుకుంటాను అని వెంకీ తెలిపారు.