ఖేళో ఇండియా యూత్ గేమ్స్ 2019

SMTV Desk 2019-01-09 16:18:16  Khelo India, Youth Games, January 9-20

ముంబై, జనవరి 9: ఖేళో ఇండియా యూత్ గేమ్స్ జనవరి 9 నుండి మొదలు కానున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో గల శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలతోపాటు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 10 వేల మంది క్రీడాకారులు పాల్గొంటారు. క్రీడాకారుల వయస్సు ఆధారంగా అండర్ -17 కేటగిరీల పోటీలు నిర్వహించనున్నారు. జనవరి 9 నుండి 20 వరకు జరిగే ఈ పోటీల ముఖ్య ఉద్దేశం ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్కాలర్ షిప్ అందిచడం. ఈ వేడుకలను ‘స్టార్ ఇండియా ప్రసారం చేయనుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ప్రసారం చేస్తారు.