'కాంచన 3' ఫస్టులుక్ రీలీజ్..

SMTV Desk 2019-01-09 16:15:55  Lawrence, new movie, kanchana 3, First look

హైదరాబాద్, జనవరి 9: డాన్స్ మాస్టర్ లారెన్స్ నుంచి వచ్చిన ముని, కాంచన మరియు గంగ సినిమాలు ప్రేక్షకులను వొక రేంజ్ లో భయపెట్టేశాయి. బలమైన కథాకథనాలతో ప్రేక్షకులను భయపెడుతూనే, భారీ లాభాలను లారెన్స్ సొంతం చేసుకున్నాడు. కొంత గ్యాప్ తీసుకున్న ఆయన కాంచన 3 ని రూపొందించాడు. ఈ సినిమాలో ముగ్గురు భామలు వేదిక, నిక్కీ తంబోలి, ఓవియా కథానాయికలుగా కనిపించనున్నారు. లారెన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగును పూర్తి చేసుకుంది.

ఈ సందర్బంగా ఈ చిత్రం నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. రుద్రాక్షలు ధరించిన మధ్య వయస్కుడిగా చాలా స్టైల్ గా .. లారెన్స్ కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఈ పోస్టర్, ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ హారర్ థ్రిల్లర్ తో లారెన్స్ ఇంకెంతగా భయపెడతాడో వేచి చూడాలి.