ఆంధ్రలో 'వినయ విధేయ రామ' స్పెషల్ షోలకి అనుమతి..

SMTV Desk 2019-01-08 15:53:14  Ram Charan, Vinaya Vidheya Rama, Boyapati Srinu, kiara advani, Special shows

హైదరాబాద్, జనవరి 8: రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా, జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఈ సినిమా స్పెషల్ షోలకి గాను ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతిని పొందింది.

ఈ నేపథ్యంలో పండుగ రోజులలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ అదనంగా మరో రెండు షోలు వేయబడతాయి. ఇలా అదనపు షోలకి అనుమతి లభించడం వలన, ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం వుంది. బోయపాటి మార్క్ మాస్ అంశాలు .. చరణ్ యాక్షన్ .. కైరా అద్వాని గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రం తప్పకుండా రామ్ చరణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.