బాలకృష్ణపై నాగబాబు ఫైర్..

SMTV Desk 2019-01-08 11:09:24  Balakrishna, Nagababu, Comments

హైదరాబాద్, జనవరి 8: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ మధ్యన కొన్ని అలగా, బలగా పార్టీలు, సంకరజాతి పార్టీలు పుట్టుకొచ్చాయని జనసేనపై పరోక్ష కామెంట్లు చేశారని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. ఓ సందర్భంలో బాలకృష్ణ ‘అల్లుడు పింజారి.. మరదలు మరాఠి అని అన్నారనీ, ఇతర కులాలు, జాతులపై ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని వ్యాఖ్యానించారు. తెదేపాకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మాట్లాడినందుకు జనసేన కోసం పనిచేసేవారిని అలగా బలగా జనం అని విమర్శించారని గుర్తుచేశారు. బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ఐదో కామెంట్ పేరుతో ఓ వీడియోను ఈరోజు విడుదల చేశారు.

తెలుగుదేశంలో అయినా, జనసేనలో అయినా ఇంకా ఏ పార్టీలో అయినా ఎస్సీ,ఎస్టీ, కమ్మ,కాపు, వైశ్య లాంటి అన్ని కులాలకు చెందినవారు ఉంటారని నాగబాబు స్పష్టం చేశారు. ‘ప్రజలను సంకరజాతి మనుషులు అన్నారే.. మీరు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకు ఎవరూ చెప్పలేదా? ఈ వ్యాఖ్యలపై కూడా మేం స్పందించలేదు. మీ వ్యాఖ్యలతో ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. జనసేన పార్టీలోనూ రెడ్లు, కమ్మ, కాపులు ఉన్నారు. మనసుకు బాధగా అనిపించినా మేం స్పందించలేదు అని నాగబాబు వ్యాఖ్యానించారు. వొకరితో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, త్వరలోనే ఆరవ కామెంట్ కి సమాధానం చెప్పి ఈ వివాదానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు.