నిమ్మకూరులో ‘యన్.టి.ఆర్’ చిత్ర బృందం..

SMTV Desk 2019-01-07 17:13:00  NTR Biopic, Balakrishna, Krish, kalyan ram, Movie Promotions

విజయవాడ, జనవరి 7: బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా యన్.టి.ఆర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కథానాయకుడు, మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న కథానాయకుడు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర ప్రమోషన్ కూడా శరవేగంగా జరుగుతుంది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాలోని నిమ్మకూరుకు ‘యన్.టి.ఆర్ చిత్రం యూనిట్ చేరుకుంది.

ఈ నేపథ్యంలో అక్కడ తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నందమూరి బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ చిత్రంలో బసవతారకం పాత్ర పోషించిన నటి విద్యాబాలన్ కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందమూరి కల్యాణ్ రామ్, ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.