అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

SMTV Desk 2019-01-07 16:14:57  Narendra Modi, Reservations, Upper Casts

న్యూఢిల్లీ, జనవరి 7: రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీనికి సంబంధించిన రాజ్యంగ సవరణ బిల్లును రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా ఈ రిజర్వేషన్లలో ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేస్తుందో తెలియాల్సి ఉంది. మరోవైపు, అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి.