ఎన్టీఆర్ సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నా : చరణ్

SMTV Desk 2019-01-07 15:25:56  Ram Charan, Vinaya Vidheya Rama, Balakrishna, NTR Biopic, Rajanikanth, petta, F2

హైదరాబాద్, జనవరి 7: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాతి సందర్బంగా ఈ నెల 11న విడుదల కానుంది. రామ్ చరణ్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. కాగా, ఈ సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద చిత్రాలు ఉండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. 9న బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు , 10న సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం పేట , 11న వినయ విధేయ రామ , 12న వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన ఎఫ్2 విడుదల కానున్నాయి.

దీనిపై చరణ్ మాట్లాడుతూ, రెండు, మూడు భారీ చిత్రాలను సంక్రాంతి సీజన్ ఆకామడేట్ చేయగలదని... వారం రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద మరో చిత్రాన్ని కూడా రీలీజ్ చేయవచ్చని తెలిపాడు. ఈ సంక్రాంతి పోటీ గురించి తాను ఆందోళన చెందడం లేదని, అన్ని సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం వ్యక్తం చేసారు. బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమాపై చరణ్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ బయోపిక్ ఎంతో గౌరవనీయమైన చిత్రమని అన్నాడు. ఎన్టీఆర్ పై ఎంతో గౌరవంతో దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పాడు. కథానాయకుడు సినిమా కోసం తాను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన ఎప్2 మూవీ సూపర్ హిట్ అవుతుందని రామ్ చరణ్ తెలిపాడు. వెంకీగారిలా మరెవరూ కామెడీ చేయలేరని... కుటుంబాలను ఆకట్టుకునేలా ఆయన చిత్రాలు ఉంటాయని చెప్పాడు. వెంకటేష్ పక్కన తన సోదరుడు వరుణ్ ఎలా చేశాడో చూడాలని ఆశగా ఉంది అన్నాడు.