తెలుగులో రీలిజ్ కు 'విశ్వాసం' ప్రయత్నం..

SMTV Desk 2019-01-07 10:58:57  Ajith, new movie, Viswasam

హైదరాబాద్, జనవరి 7: తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో తలా అజిత్, నయనతార జంటగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'విశ్వాసం' రూపొందింది. జనవరి 10వ తేదీన ఈ సినిమాను తమిళనాట భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇదే రోజున తమిళంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీ ' పేట ' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుండటంతో, అంచనాలు భారీగానే వున్నాయి. ఈ రెండు సినిమాలు వొకే రోజున థియేటర్లకు వస్తుండటంతో తమిళ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక తెలుగులో కూడా 'విశ్వాసం' చిత్రాన్ని ఇదే తేదీన రిలీజ్ చేయాలని భావించారుగానీ కుదరలేదు.

తెలుగునాట సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద సినిమాలతో పాటు రజనీ సినిమా కూడా రంగంలోకి దిగుతోంది. థియేటర్ల సమస్య తలెత్తుతుందని తెలుగులో విశ్వాసం విడుదలను వాయిదా వేసుకున్నారు. జనవరి చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం. ఆ దిశగానే గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా జగపతిబాబు కనిపించనున్నారు.