రెచ్చిపోయిన అజిత్ అభిమానులు...అరెస్ట్

SMTV Desk 2019-01-06 13:14:11  Ajith kumar, Viswasam, Fans, Police, Arrest, Theni

చెన్నై, జనవరి 6: తమిళ సంచలన నటుడు అజిత్ శివ దర్శకత్వంలో వస్తున్న విశ్వాసం సినిమా ఈ నెల 10 కి విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇనిమా ఇప్పుడు వివాదాలకు దరి తీస్తుంది. వివరాల ప్రకారం సినిమా విడుదల సందర్భంగా అజిత్ కటౌట్ లు, పోస్టర్లు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అభిమానులు. థేని జిల్లాలోని కొడువిలర్పట్ గ్రామంలో అతికించిన ఓ పోస్టర్ ని చింపేశారు. దీంతో అజిత్ అభిమానులకు, పోస్టర్ అతికించిన ప్రదేశంలో నివసిస్తున్న ఇంటి యజమాని జయమనికి మధ్య గొడవ మొదలైంది. అభిమానులు యజమానిని దూషించి, చంపుతామని బెదిరించారట. దీంతో జయమని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలమురుగన్, అజిత్ కుమార్, విజయ్, సెల్వకుమార్ లతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.