జైళ్ళలో పెరుగుతున్న ఖైదీల సంఖ్య.. నివ్వెరపోయే కారణం.!

SMTV Desk 2019-01-05 11:16:16  Thihar jail, Incresing criminals

న్యూఢిల్లీ, జనవరి 5: మాములుగా శీతాకాలంలో చలి ఎక్కువ, ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే చలి తీవ్రత ఇంకా అధికంగా ఉంటుంది. ఈ చలికి ఇంట్లో ఉండటమే చాలా కష్టంగా ఉంది. ఏ దిక్కూలేక రోడ్ల మీద పడుకునే వారి పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. అయితే వారు రోడ్లపై నిద్రించలేక నేరాలకు పాల్పడుతున్నారట. దేశ రాజధాని ఢిల్లీలో రహదారుల పక్కన నిద్రించేవారు చాలా ఎక్కువగా ఉంటారు. వీరిలో ఎక్కువ మంది చలిని తట్టుకోలేక నేరాలకు పాల్పడుతున్నారట. దాంతో తీహార్ జైల్లో ఖైదీల సంఖ్య పెరిగిపోతోంది. ఈ విషయం తెలుసుకుని జైలు అధికారులే నివ్వెరపోయారు. తీహార్ జైలు సామర్థ్యం 10,027 మంది. కానీ ప్రస్తుతం అక్కడ 20,000మంది ఉన్నారు.

కాగా, దీనిపై ఓ జైలు అధికారి మాట్లాడుతూ.. కొందరు ఖైదీలతో తమ సిబ్బంది మాట్లాడిన సమయంలో శీతాకాలంలో చలికి రోడ్లపై ఉండటం కంటే జైల్లో ఉండాలనే ఉద్దేశంతో వారు నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు.