భారీ బయోపిక్ లో షారుక్...

SMTV Desk 2019-01-03 19:23:34  Sharuk khan, new movie, Rakesh sharma Biopic

ముంబై, జనవరి 3: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జీరో సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. షారుక్ ఖాన్ చేసిన ప్రయోగాత్మక ప్రయత్నానికి ప్రశంసలు లభించాయి కానీ, వసూళ్ల పరంగా ఈ సినిమా నిరాశ పరిచింది. తన కెరియర్లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన షారుక్, ఈ సినిమా పరాజయాన్ని అంతగా పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు. తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్ లో షారుక్ నటిస్తాడు.

ఈ సినిమాకి సెల్యూట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాకి, మహేశ్ మతాహి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ కోసం ముంబై ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నారట. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.